మాట్లాడుతున్న వైస్ ఎంపిపి
ప్రజాశక్తి -హుకుంపేట: మండలం లోని జర్రాకొండ పంచాయితీ గనిక, చీకుమద్దుల పంచాయితీ, గిల్లబడ్డు తదితర గ్రామాలకు సంబంధించి రోడ్డు సమస్యల పై వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం కలెక్టర్ సుమీత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాటా ్లడుతూ, రోడ్డు పనులకు పర్మిషన్ లేదనే కారణం తో పారెస్టు అధికారులు నిర్మాణ పనులు నిలిపి వేశారన్నారు. రోడ్డు పనులు జరిగేలా చూడాలని కలెక్టర్‌ని కోరారు. ఈ కార్యక్రమంలో జర్రా కొండ సర్పంచ్ కొర్ర చిట్టిబాబు,గనిక వార్డు మెంబర్, బడ్నైని కొండబాబు, పీసుమామిడి వార్డు మెంబర్, బోయిని కొండబాబు, వార్డు మెంబర్ పాంగి అప్పన్న పాల్గొన్నారు.










