
కురుపాం: మండల కేంద్రానికి సమీపంలో గల బల్లుకోట గిరిజన గ్రామానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి చొరవ తీసుకొని కొత్తగా చేపట్టిన బల్లుకోట శాశ్వత రహదారి నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామ గిరిజనులు మాట్లాడుతూ అటవీ శాఖ జిల్లా అధికారులు ఆదేశాల మేరకు బి.టి రహదారి పనులు తాత్కాలికంగా ఆపివేయాలని, అటవీశాఖ పూర్తి అనుమతి వచ్చిన తర్వాతే కొనసాగించాలని సూచించారని, ఐటిడిఎ నుంచి అనుమతి కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉందని డిఎల్‌సి, అటవీశాఖ అనుమతి తర్వాత బిటి వేయాలని అంతవరకూ పని ఆపివేయాలని అడ్డుకున్నారని అన్నారు. ఇంత శరవేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామస్తులు ఆనందంలో ఉన్న అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని కావున పై అధికారులు స్పందించి తమ గ్రామ రహదారి పరులు జరిగేలా చూడాలని కోరుతున్నామన్నారు.