Jun 12,2023 00:02

పరిశీలిస్తున్న గంగరాజు, నేతలు

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని వేంగడ పంచాయతీ పరిధి బంధవలస గ్రామం నుండి పెన్నంతి వరకు రోడ్డు పనులను జడ్పిటిసి దిసరి గంగరాజు పరిశీలించారు. ఆదివారం సిపిఎం బృందంతో సందర్శించిన జెడ్పిటిసి రోడ్డు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జెడ్పిటిసిగా గెలిచిన అనంతరం బంధవలస, పెన్నంతి, డాలింగ్‌ పుట్టు, మెట్టపాడు .తదితర గ్రామాలలో సందర్శించడం జరిగిందన్నారు. ఆ గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని, జిల్లా పరిషత్‌ నిధులు 5.లక్షలతో బందవలస గ్రామం నుండి పెన్నంతి మెయిన్‌ రోడ్డు వరకు మూడు కిలోమీటర్లు వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమ్మలపాడు మెయిన్‌ రోడ్డు నుండి హుకుంపేట మండలం జంబువలస మీదుగా వెంగడ, మెట్టపాడు నుండి పెన్నంతి, డొంకపుటు వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. బందవలస నుండి పెన్నంతి మీదుగా అత్యవసర పరిస్థితుల్లో తక్కువ కిలోమీటర్లలో గమ్యం చేరుకోవచున్నారు. వేంగడ మెయిన్‌ రోడ్డు బందవలస మార్గమధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేంగడ సర్పంచ్‌ చోడేపల్లి సీమ, టోకురు సిపిఎం సర్పంచ్‌ కిల్లో .మొస్య, వెంగడ సిపిఎం మాజీ సర్పంచ్‌ సివెరి. కొండలరావు, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ .నాగులు, గ్రామస్తులు అనిల్‌, అప్పన్న, నర్సింగ్‌, ధర్మ పాల్గొన్నారు.