Jul 06,2023 00:49

పల్నాడు జిల్లా: ఎపి రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు ఆధ్వర్యంలో బొప్పూడి, మురికిపూడి గ్రామాల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ సమక్షంలో బుధవారం కలెక్టర్‌ను కలిశారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి, మురికిపూడి గ్రామా ల్లోని బైపాస్‌ రోడ్డు పక్క భూములకు నిర్మాణ సంస్థ గోడలు నిర్మిస్తే రైతులు వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూపి గోడ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. గోడ నిర్మాణం జరిగితే రైతులు భూములు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తుందని రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రోడ్డు నిర్మాణపనులకు అధికారుల, రైతుల అనుమతి పొందే వరకు పనులు నిలిపివేయాలని కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌ మాట్లాడుతూ రానున్న మంగళవారం హైవే అధికారులతో, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బి.శంకరరావు, బొప్పూడి మాజీ సర్పంచ్‌ పి. హరి బాబు, రైతులు బి.శ్రీనివాసరావు, జి.నాగేశ్వర త రావు, సిహెచ్‌ రమణమూర్తి, జి. వెంకట సుబ్బారావు, ఎన్‌. వీరస్వామి, బి.శ్యామసుందర్‌ బాబు పాల్గొన్నారు.