Mar 24,2023 23:55

నినాదాలు చేస్తున్న గంగరాజు, గిరిజనులు

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని పెదబిడ్డ పంచాయతీ చెరుకుమెడత జంక్షన్‌ నుండి కంటిపురం మీదుగా భల్లుగుడ వరకురెండు కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి దీసరి.గంగరాజు డిమాండ్‌ చేశారు. పెదబిడ్డ, గుమ్మ పంచాయతీల్లోని 38 గ్రామాలకు ఈ రహదారి ఉపయోగకరంగా వుంటుందన్నారు. అర్ధాంతరంగా నిలిపి వేసిన రోడ్డు పనులు పునరుద్ధరించాలని స్థానిక ప్రజలతో కలిసి ఆయన శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డుకిరువైపులా తవ్వి అర్దాంతరంగా విడిచి పెట్టడంతో వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాహనాలు పడి పోతున్నాయ న్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సోమేల నాగులు, సొవేరి వెంకటరావు, జన్ని అప్పారావు, జన్ని. బుజ్జిబాబు, సొవేరి సుబ్బారావు, వంతల బుద్రయ్య, కోనేపు కొండలరావు, కోనేపు చిన్నరావు పాల్గొన్నారు.