
ప్రజాశక్తి -కోటవురట్ల:జగ్గంపేట శివారు తడపర్తి, శ్రీరాంపురం రోడ్డు నిర్మాణం చేపట్టాలని సోమవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు నిరసన చేపట్టారు అనంతరం తహసిల్దార్ జానకమ్మకు వినతిపత్రం అందజేశారు. తడపర్తి. శ్రీరాంపురం రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా వదిలివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంకటాపురం నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్డు నిర్మాణం చేపట్టి అటవీ శాఖ భూములు ఉన్నాయనే కారణంతో నిర్మాణం మధ్యలో నిలిపివేశారని చెప్పారు. వాస్తవానికి అటవీ శాఖకు సంబంధించిన భూమి కిలోమీటర్ మాత్రమే ఉందని, గతంలో జిల్లా కలెక్టర్‌కు విన్నవించామని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణరాజు, బాబురావు, రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.