Nov 15,2022 00:08

మాట్లాడుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ప్రజాశక్తి -పాయకరావుపేట
మండలంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం పర్యటించారు. గోపాలపట్నం గ్రామంలో ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి సోమవారం మంత్రి అమర్‌నాథ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ, సీతమ్మ వారి మెట్ట మీదకు రహదారి నిర్మించడానికి అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చిక్కాల రామారావు, మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, స్థానిక సర్పంచ్‌ పన్నీర్‌ పాపారావు, నియోజవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు