Oct 03,2023 22:34

రోడ్డు నిర్మాణాలకు రూ. కోటి 60 లక్షల రూపాయలు మంజూరు చేయండి..

రోడ్డు నిర్మాణాలకు రూ. కోటి 60 లక్షల రూపాయలు మంజూరు చేయండి..
నాయుడుపేట
ఎఎంసి ఛైర్మన్‌ జనార్థన్‌రెడ్డి
ప్రజాశక్తి- నాయుడుపేట: నాయుడుపేట మార్కెట్‌ కమిటీ పరిధిలో వ్యవసాయ పొలాల్లో రోడ్డు నిర్మాణాలకు నిధులు ఒక కోటి 60 లక్షల రూపాయలు మంజూరు చేయాలని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని నాయుడుపేట ఏఎంసి చైర్మన్‌ తంబిరెడ్డి జనార్దన్‌ రెడ్డి కోరారు. మంత్రిని నెల్లూరులోని ఆయన నివాసంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సమక్షంలో నాయుడుపేట ఏఎంసి చైర్మన్‌ తంబిరెడ్డి జనార్దన్‌ రెడ్డి, తంబిరెడ్డి సురేష్‌ రెడ్డిలు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రి గోవర్ధన్‌ రెడ్డికి శాలువాలు కప్పి, పుష్ప గుచ్ఛాులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయుడు పేట వ్యవసాయ మార్కెట్‌కు సంబంధిం చిన కొన్ని ప్రతిపాదన లను ఆయన ముందుంచారు. నాయుడుపేట మార్కెట్‌ కమిటీ పరిధిలో వ్యవసాయ పొలాల్లో రోడ్డు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఒక కోటి 60 లక్షల రూపా యల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. నాయుడుపేట మార్కెట్‌ కమిటీ సెస్‌ వసూళ్లలో ఇప్పటికే జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని మంత్రికి తెలిపారు. గ్రామీణ ప్రాంత పంట పొలాల్లోకి రోడ్డు నిర్మాణాలను ఏర్పాటు చేసి రైతు లను ఆదుకోవాలని వారు కోరారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఏఎంసీ చైర్మన్‌ తంబిరెడ్డి జనార్దన్‌ రెడ్డి తెలిపారు.