Aug 25,2023 17:58

గుండుగొలనుగుంట ప్రజలు హర్షం
ప్రజాశక్తి - ద్వారకా తిరుమల
     ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌ నుంచి గుండుగోలుగుంట వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు శుక్రవారం పరిశీలించారు. ఎంతోకాలంగా ఈ రోడ్డు గతుకులమయంగా ఉండేది. ఇటీవల ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో గుండుగోలనుగుంట వెళ్లే ప్రజలు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండల వైఎస్‌ఆర్‌సిపి యువనేత బొండాడ వెంకన్నబాబు, ద్వారకాతిరుమల సొసైటీ అధ్యక్షులు కుర్రాల లక్ష్మణ్‌, జడ్‌పిటిసి చిగురుపల్లి శామ్యూల్‌, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఇమ్మడి నాగు, అన్సారీ భాషా, వార్డ్‌ మెంబర్‌ అచ్చుత ఏసుబాబు, మానకొండ సుబ్బారావు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు.