Jul 06,2023 23:20

తాడేపల్లి: రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో గుంటూరు ఛానల్‌ రెగ్యులేటర్‌ దగ్గర నుంచి కొండవీటి వాగు వరకు 1.5 కిలోమీటర్లు తారురోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి గురువారం పరి శీలించారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో పనులు చేప ట్టారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు ఎమ్మెల్యే చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశిం చారు. త్వరగా రోడ్డు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావా లని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీరింగ్‌ అధి కారులు, ఎఇ కిషోర్‌రెడ్డి, వైసిపి నాయకులు ఇ.డేవిడ్‌రాజు, భాస్కరరెడ్డి, దంటు బాలాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.