May 20,2023 19:43

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - హోళగుంద
ఢణాపురం టు హోళగుంద రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, ఢణాపురం, హెబ్బటం మీదుగా ఆర్‌టిసి బస్సులు నడపాలని టిడిపి మండల కన్వీనర్‌ తిప్పయ్య కోరారు. శనివారం స్థానిక బస్టాండులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు రోజుల నుంచి రోడ్డు పాడైపోయిందని, ఢణాపురం నుంచి హోళగుంద రోడ్డులో బస్సులు నడిపితే ఆదాయం కన్నా ఖర్చులు పెరిగాయని తెలిపారు. ఆదోని డిపో మేనేజర్‌ ఆలూరు మీదుగా హోళగుందకు బస్సులు నడపడం బాధాకరమన్నారు. ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చొరవ తీసుకొని మార్లమడిగి రోడ్డు, ఢణాపురం నుంచి హోళగుంద రోడ్డు నిధులు ముంజూరు చేయించి రోడ్డు నిర్మాణ పనులు జరిగేేలా కృషి చేయాలని కోరారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.