'గడపగడపకూ మన ప్రభుత్వం'లో ప్రజల విన్నపం
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
డాంగే నగర్‌లో రోడ్డు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత నివాసులు ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజాను కోరారు. స్థానిక 29వ వార్డులో గురువారం నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసు కున్నారు. రోడ్లు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికు లు కోరారు. రేషన్ కార్డుల మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై స్పందించిన ఎంఎల్‌ఎ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ ఛైర్మన్లు కంచర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ పి.భవానీప్రసాద్, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ వందనపు సాయిబాల పద్మ, పట్టణ అధ్యక్షులు పిపిఎన్.చంద్రరావు పాల్గొన్నారు.










