Jun 25,2023 00:54

మోకాళ్ళపై నిరసన తెలుపుతున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -రావికమతం:రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వెలుగు ఎపిఎం తిలక్‌ సూచించారు. మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలి వద్ద వెలుగు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా తిలక్‌ మాట్లాడుతూ, రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లేటప్పుడు సూచికలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అతివేగంగా, మద్యం సేవించి డ్రైవ్‌ చేయకూడదన్నారు. హెల్మెట్‌ ప్రతి ఒక్కరు ధరించి ప్రయాణాలు సాగించడం మంచిదన్నారు. రోడ్డు ప్రమాదాలతో అనేకమంది ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి నెలకొంటుంద అన్నారు.యువత స్పీడు డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదంలోనే అత్యధికంగా మరణించడం జరుగుతుందన్నారు. రోడ్డుకు ఇరువైపులా వెనుక ముందు చూసుకొని ప్రయాణం సాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ఐకెపి సిబ్బంది పలువురు పాల్గొన్నారు.