పజాశక్తి -యంత్రాంగం
ఆనందపురం : రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని ఆనందపురం ట్రాఫిక్ ఎస్‌ఐ రఘురాం పేర్కొన్నారు. ఆనందపురం మార్కెట్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై ప్లకార్డుల ద్వారా గురువారం అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్ల గత సంవత్సరం 147 మంది ద్విచక్ర వాహనదారులు చనిపోయారని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్‌ను విధిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తారకేష్, తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ ధరించాలి
తగరపువలస : ద్విచక్ర వాహనాలను నడిపే వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని భీమిలి ట్రాఫిక్ ఎస్సై సిహెచ్.చిరంజీవిరావు సూచించారు. ఈ మేరకు గురువారం గోస్తనీ జంక్షన్ వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.










