వగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ
ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం ఎస్‌ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల ముమ్మర తనిఖీలు నిర్వహించారు. త్రిపుల్ రైడింగ్, అతివేగంగా నడుపుతున్న 35 వాహనాలపై అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా వాహనదారులకు, యువతకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ,డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని తెలిపారు. హెల్మెట్లు ధరిస్తే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు.










