దీక్ష చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలు
ప్రజాశక్తి-బొబ్బిలి : పట్టణంలోని పూల్‌బాగ్ రోడ్డు బాగు చేయాలని ఆదివారం జనసేన ఆధ్వర్యంలో రాజా కళాశాల వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరడ అప్పలస్వామి మాట్లాడుతూ పూల్‌బాగ్ రహదారి పాడైపోయి ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రహదారి బాగుచేసేందుకు మున్సిపల్ సాధారణ నిధులు కేటాయించినా ఎందుకు పనులు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. దీక్షకు టిడిపి సీనియర్ నాయకులు రౌతు రామమూర్తి, సుంకరి సాయిరమేష్, కాకల వెంకటరావు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.










