Sep 17,2023 23:24

రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో ఆదివారం పారిశుధ్య పనులు జరిగాయి. ఈ నెల 15 నుండి వచ్చే నెల 15 వరకు పారిశుధ్య మాసోత్సవములలో భాగంగా గ్రామంలోని గోగులపాడురోడ్‌ లోని ఇళ్ళ ముందు ఉన్న సైడ్‌ కాల్వల్లో పూడిక తీశారు. ఆయా పనులను సర్పంచ్‌ కొమ్ము నాగేశ్వర రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామస్తులు తమ ఇళ్ల ముందున్న మురుగు కాల్వల్లో నీరు నిలవకుండా పారే విధంగా చేయాలని అన్నారు. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండటం వలన దోమలు పెరిగి మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశ ముందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి ఎస్‌ నాగేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచులు పడాల చక్రారెడ్డి, గెల్లి చినకోటిరెడ్డి పాల్గొన్నారు.