ఇంకొల్లులో రంజాన్ తోఫా అందిస్తున్న బాబర్ బాషా
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఇంకొల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ బాబర్‌బాషా పేద ముస్లిములు 300 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పండుగకు పేద వారు పస్తు ఉండకూడదనే భావనతో వారికి అవసరమైన సుమారు వెయ్యి రూపాయల విలువైన పండుగ సరుకులను కుటుంబ సభ్యులు ప్యాకింగ్ చేసి పేదలకు అందించారు. ప్రతి ఏటా రంజాన్, బక్రీద్ పండుగకు తాము ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని బాబర్‌బాషా వివరించారు. ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపిఎస్‌ఆర్‌టిసి ఇంకొల్లు కంట్రోలర్ షేక్ బాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










