Apr 17,2023 20:19

పంపిణీ చేస్తున్న ఎస్‌ఐ తదితరులు

రంజాన్‌ తోఫా పంపిణీ

ప్రజాశక్తి -చాగలమర్రి

పట్టణంలోని మల్లెవేముల బస్టాండు సమీపంలో ఆల్‌ఖైరా ఎడ్యు కేషనల్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు రంజాన్‌ తోఫా కిట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కిట్లను సుమారు 150 మంది నిరు పేదలకు ఎస్‌ఐ రమణయ్య, వైసీపీ రాష్ట మైనార్టీ సెల్‌ కార్యదర్శి బాబులాల్‌లు పంపిణీ చేసారు. అనంతరం ట్రస్టు అధ్యక్షులు మౌళానా అబ్ధుల్‌ మజీద్‌ ఆరీఫ్‌ మాట్లాడుతూ ఈ స్వచ్చంద సంస్థ ద్వారా మరిన్నీ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ కమ్యూనికేషన్‌ సభ్యులు మౌలానాలు అబ్దుల్‌ సమ్మద్‌, సుభహాన్‌, సలాం, సులేమాన్‌ ,తదితరులు పాల్గొన్నారు.