రంజాన్ తోఫా కిట్లు పంపిణీ
ప్రజాశక్తి - నంద్యాల
అల్‌మేవా గౌరవ అధ్యక్షులు అబులైస్, జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ పాషా, అసోసియేట్ అధ్యక్షులు డా,,జఫ్రూళ్ల ఆధ్వర్యంలో మంగళవారం రంజాన్ తోఫా కిట్లను జిల్లా కలెక్టర్ మనాజీర్ జిలాని సామూన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆల్ మేవా సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఆల్‌మేవా ఉద్యోగుల సమస్యలతో పాటు వెల్ఫేర్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుందని చెప్పారు. ఆల్ మేవా పిలుపును ఆదరించి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగి దాతకు ధన్యవాదాలు తెలియజేశారు. ముందస్తుగా అందరికి పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్‌మేవా నాయకులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే మైనారిటీ ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా వారి జాకాత్ సొమ్ము నుండి ఆన్‌లైన్ ద్వారా రూ.1,84,000 పంపించగా ఈ సొమ్ముతో, అందరితోపాటు బీదలు రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకొనుటకు కావాల్సిన రూ.467 విలువ చేసే సరుకులు కలిగిన 390 రంజాన్ తోఫా కిట్లు తయారు చేశామన్నారు. ఈ కిట్లను ఆల్ మేవా జిల్లా కార్యవర్గ సభ్యులు అవసరార్ధులను గుర్తించి వారి ఇళ్లకు చేరవేస్తారని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్స్ నబీరసూల్, మహమ్మద్ గౌస్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ జాకీర్ హుస్సేన్, ఐఅండ్‌పిఆర్ ఆసిఫ్ అహ్మద్, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ జాకీర్ హుస్సేన్, మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.










