అక్కడో పువ్వు రాలింది
ఔనా!
అదే రంగు
ఆ చెట్టు ఎక్కడుంది
ఊరి చివరనా
ఊరి మధ్యనా
ఎలా రాలింది
ఎవరైనా రాల్చారా
తనంతట తానే రాలిపోయిందా
వేళా పాళా లేకుండా రాలితే ఎలా
స్వచ్ఛమైన పువ్వుకి
రంగులు పూస్తేనే
అర్హమో అనర్హమో తేలుతుంది
జనారణ్యంలో ఎన్నో పాదాలు
తచ్చాడుతుంటాయి
వాటికి పూలను తొక్కటమే తెల్సు
ఒక్క చేయైనా రాలే పువ్వును
ఒడిసిపడితే వికాసం వెదజల్లు
సమాజం నిండా
పువ్వు రుధిరంలో తడిసి
మరో ప్రపంచం వైపు
జ్వాలలు విపణి వీధిలో కొనబడుతున్నాయి
స్వల్పకాలంలో ఆ పువ్వుని మరిచే
జ్ఞాని మనిషి
(రమ్య హత్యకి చలించి)
గిరి ప్రసాద్ చెలమల్లు
94933 88201