May 28,2023 23:35

భవానిని సత్కరిస్తున్న సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ ఎన్టీఆర్‌ ఉచిత సినిమాల రూపకర్త కొమ్మినేని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న శకపురుషుని శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్‌ నటించిన 'దానవీరసూరకర్ణ' చిత్రాన్ని ఆదివారం ఉచితంగా ప్రదర్శించారు. గతేడాది మే 28న ప్రారంభించిన వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్‌ చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక జెఎంజె కళాశాల ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న స్వధార్‌ హోమ్‌ అనాధలకు దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. పెదరావూరులో 50 అడుగుల ఎన్టీఆర్‌ భారీ కటౌట్‌ను ఎన్‌టిఆర్‌ అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఏర్పాటు చేశారు. శతాబ్ధి ఉత్సవాల్లో రోజుకొక కళాకారులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రంగస్థల నటి దేవరపల్లి భవానిను బుర్రా సాయిమాధవ్‌, కొమ్మినేని వెంకటేశ్వరరావు, పెమ్మసాని పోతురాజు, సిహెచ్‌ సింగరావు, ఎస్‌.సాంబశివరావు, ఇ.శ్రీనివాసరావు, ఎ.మల్లేశ్వరరావు, ఎన్టీఆర్‌ జగన్‌, ఎం.రాఘవరావు, డి.భాస్కరరావు, జి.ప్రసాద్‌, ఎం.వెంకట్‌, ఎన్‌.శ్రీనివాస్‌, వసంతయామిని తదితరులు ఎన్టీఆర్‌ జ్ఞాపికను అందించి సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆవుల చక్రవర్తి, డాక్టర్‌ వి.ఆదిశేషగిరిరావు, టి.హరిప్రసాద్‌, బి.వెంకట్‌, కె.శ్రీనివాసరావు, డి.నరసయ్య, కె.శ్రీనివాస్‌ పాల్గున్నారు.