'రమణీయం' ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : స్థానిక జవహర్ భారతి కళాశాల ఆవరణలోని ఎం.ఎం. హాలులో ఆదివారం జవహర్ భారతి డిగ్రీ కళాశాల మాజీ కరస్పాండెంట్ 'ఎన్.వి.రమణయ్య' స్మారక సంచిక ''రమణీయం'' ఆవిష్కరణ సభ నిర్వహించారు. సాహితీ మిత్రులు, విజయవాడ, సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్, కావలి వారు దీనిని సంయుక్తంగా నిర్వహించారు. ఈ కారక్రమానికి కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మాల్యాద్రి ఆధ్యక్షత వహించి మాట్లాడుతూ నిరాడంబరతకు, సామాజిక సేవకీ రమణయ్య మారుపేరు అని గుర్తు చేశారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినరుకుమార్ రెడ్డి ''రమణీయం'' పుస్తకాన్ని ఆవిష్కరించి, విశ్వోదయకు ఆయన చేసిన సేవను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు ప్రసంగిస్తూ వారు ప్రచురించిన 'అక్షర', 'ఇయర్స్ ఆఫ్ విజన్', 'పరిశోధన', 'మధుమురళి', 'శంకరన్' పుస్తకాలు రమణయ్య సమాజానికి ఇచ్చిన ఆస్తి అని పేర్కొన్నారు. జవహర్ భారతి పూర్వ విద్యార్థి, విప్లవ రచయిత జి.కళ్యాణరావు ముఖ్య వక్తగా మాట్లాడుతూ జవహర్ భారతి అధ్యాపకులు చదువు మాత్రమే కాక, సమాజ సేవ, స్వతంత్ర ఆలోచనలు, ప్రశ్నించడం, అంకిత భావం నేర్పేవారని, అలాంటి వారిలో రమణయ్య మాష్టారు ముందు వరుసలో ఉండేవారని తెలిపారు. మరోవక్త 'లహరి' పత్రిక సంపాదకులు హెచ్.ఎస్.వి.కే. రంగారావు ప్రసంగిస్తూమన మధ్య నడిచిన మహానుభావుడు రమణయ్య అని గుర్తు చేశారు. రాధాకష్ణమూర్తి, వకుళాభరణం రామకృష్ణ, కె.వి. కోటిలింగం పంపిన సందేశాలు విశ్రాంత అధ్యాపకుడు వి.చెంచయ్య చదివి వినిపించారు. రమణయ్య ద్వితీయ పుత్రక రేణుక ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కూనం తాతిరెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో జె బి జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ తలారి పోతురాజు, డాక్టర్ రామ్ సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్ రెడ్డి, డైరెక్టర్, కూనం తాతిరెడ్డి, విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు చాకలకొండ శారద, విద్యార్థులు పాల్గొన్నారు.










