Feb 23,2023 00:23

డుంబ్రిగుడలో ప్రచారం

ప్రజాశక్తి-రాంబిల్లి :ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పిడిఎఫ్‌, 250 ప్రజా సంఘాలు బలపర్చిన కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ మండల కేంద్రం రాంబిల్లి పంచాయతీలో ప్రజాసంఘాల నాయకులు బుధవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.దేముడునాయుడు, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.నారాయణరావు, సిహెచ్‌.శివాజీలు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చోడిపల్లి గంగరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు సిహెచ్‌.నూకన్న, సిఐటియు నాయకులు డి.కాకియ్య తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : పిడిఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రజా సంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేముడు విజ్ఞప్తి చేశారు. మండలంలోని రొంగలినాయుడుపాలెం, గొండుపాలెం గ్రామాలలో బుధవారం ప్రజా సంఘాల నాయకులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేశారు. ప్రజా సమస్యలపై గొంతెత్తే రమాప్రభను శాసన మండలికి పంపించాలని కోరారు.
డుంబ్రిగూడ:పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ స్థానిక మండల కేంద్రంలో సిఐటియు, గిరిజన సంఘం నాయకులు బుధవారం విస్తతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌బి పోతురాజు మాట్లాడుతూ, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలతో పాటు కార్మిక కర్షకుల కోసం పిడిఎఫ్‌ అభ్యర్థులు శాసనమండలిలో గళ మెత్తుతున్నారన్నారు. రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.