ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: బీపీ రోగులు వైద్యుల సలహాలతో రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని ప్రముఖ బిపి, షుగర్ స్పెషలిస్ట్, జనరల్ మరియు ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ సానల ధీరజ్‌బాబు సూచించారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో బీపీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ధీరజ్‌బాబు మాట్లాడుతూ రక్తపోటుని నియంత్రించకుంటే గుండె జబ్బులు, మెదడు జబ్బులకు దారి తీస్తాయని తెలిపారు. అనంతరం ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి, డాక్టర్ చాపల వంశీకష్ణ మాట్లాడుతూ బిపి, షుగర్ పేషెంట్లకు ప్రతి నెలా మొదటి గురువారం తమ హాస్పిటల్‌లో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బిపి, షుగర్ పేషంట్లను ఉచితంగా చూసి, ఈసిజి, గుండె పరీక్ష, తినక ముందు తిన్న తరువాత షుగరు పరీక్ష, పాదాల నరాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని వివరించారు. ఈ సదవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ జనరల్ అండ్ లేపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సున్నపు విజరు కుమార్, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ నాగిడి కుమార్‌వర్మ, డెంటల్ సర్జన్ డాక్టర్ నందలూరు సరయు, ఫిజియో థెరపీ వైద్య నిపుణులు డాక్టర్ పొక్కినగారి ఏడుకొండలు పాల్గొన్నారు.










