Jul 19,2023 21:20

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : స్థిరమైన అభివృధి లక్ష్యాల సాధన విషయంలో పల్నాడు జిల్లాను ముందు వరుసలో ఉండేలా ఐసిడిyస్‌ సిబ్బంది పని చేయాలని కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. బుధవారం నరసరావుపేట కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్పందన హాలులో సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు క్షత్ర స్థాయిలో పర్యటించి సంపూర్ణ వివరాలు సేకరించాలని, రక్త హీనత ఉన్న మహిళలను గుర్తించి వారికి అవసరమైన హాట్‌ కుక్కుడ్‌ మీల్స్‌ అదేవిధంగా చూడాలని చెప్పారు. బరువు తక్కువుగా ఉన్న పిల్లలకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణను అందిచాలన్నారు. జిల్లాలో బరువు తక్కువగా ఉన్న పిల్లలు 2249 మంది ఉన్నారని, ఎదుగుదల తక్కువుగా ఉన్న పిల్లలు 3468 మంది ఉన్నారని, వీరికి సకాలంలో పోషక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. నాడు-నేడు కింద నిర్మాణంలో ఉన్న 13 అంగన్వాడీ కేంద్రాల పురోగతిపై వివరాలడిగారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్థిరమైన అభివృధి లక్ష్యాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. సిడిపిఒ ఉమామహేశ్వరీ, వైద్యారోగ్య శాఖ నుండి డాక్టర్‌ నాగపద్మజ పాల్గొన్నారు.