సూచనలు చేస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి -పొదలకూరు : మహిళల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పొదలకూరు బిట్ - 2 సచివాలయ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ ఎంఎల్ హెచ్ పీ బీ.మణిచందన, ఎఎన్‌ఎం హైమావతి పేర్కొన్నారు. మహమ్మదాపురం పిహెచ్‌షి డాక్టర్ నరసింహ రావు ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాలలోని బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించి, రక్త శాతాన్ని నమోదు చేసుకొని విద్యార్థులకు వారి బ్లడ్ పర్సంటేజ్‌ను తెలిపారు. రక్త హీనతతో బాధపడుతున్నవారికి తగిన మందులు ఇచ్చి వారికి అవసరమైన చికిత్స ప్రభుత్వపరంగా అందించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు అనిత కుమారి ప్రభావతి పాల్గొన్నారు.










