రక్తదాతలను సన్మానిస్తున్న సభ్యులు
ప్రజాశక్తి - హోళగుంద
గుంతకల్లులోని హంపయ్య కాలనీలో లెజెండ్ ఉత్తమ ప్రాణదాత సేవా పురస్కార్ కార్యక్రమంలో భాగంగా లెజెండ్ బ్లడ్ ఆర్గనైజషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అనేక సార్లు రక్తదానం చేసిన వారికి మంగళవారం సన్మానం చేశారు. ఎస్‌కె.గిరి 22 సార్లు రక్త దానం చేసినందుకు లెజెండ్ ఉత్తమ ప్రాణ దాత సేవా పురస్కార్ అవార్డుతో సన్మానం చేశారు. ముఖ్యఅతిథిగా వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుమార్తె, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నైరుతి మాట్లాడుతూ... సమాజంలో అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, రక్త దానం చేస్తే మనిషికి గుండె నొప్పి, క్యాన్యర్‌లాంటి వ్యాధులు రావని తెలిపారు. లెజెండ్ బ్లడ్ ఆర్గనైజషన్ సంస్థ సభ్యులు రంజాన్, హనుమంతు, రాము, బోనాల ప్రకాష్, తిప్పన్న పాల్గొన్నారు.










