రక్తదాతలే ప్రాణదాతలు ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ
రక్తదాతలే ప్రాణదాతలు
ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
నేటి రక్తదాతలే..రేపటి ప్రాణదాతలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐఐటీలో ఐఐటీ అనుబంధ నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించచారు. ఈ శిబిరంలో ఐఐటీ విద్యార్థులు, పెద్ద ఎత్తున అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 100 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరం సందర్భంగా సేకరించింది. రక్తదాన ఆవశ్యకతను సత్యనారాయణ వివరించారు. స్వచ్ఛందంగా మనం చేస్తున్న రక్తదానం భవిష్యత్తులో ఆపదలో ఉన్న ఎంతోమంది అమాయకుల ప్రాణాలను నిలబెడుతుందని వివరించారు.










