ప్రజాశక్తి- పాడేరు: రక్తాన్ని దానం చేయడంతో మరొకరి ప్రాణాలను రక్షించవచ్చునని సబ్ కలెక్టర్, ఐటిడిఎ ఇన్‌చార్జ్ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ తెలిపారు. బుధవారం స్థానిక కాఫీ హౌస్‌లో రెడ్ క్రాస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిభిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, 17 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్త దానం చేయవచ్చని, రక్తం కొద్ది రోజులలోనే తిరిగి చేరుతుందన్నారు.రక్తం దానం చేయటంతో హానికరమైన ఇనుము నిల్వలను తగ్గించుకోవచ్చని, గుండెపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మూడు నుండి ఆరు నెలల దాటినా తరువాత తిరిగి రక్తదానం చేయవచ్చని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, కార్యదర్శి ఈశ్వర రావు, కోశాధికారి టి.అప్పలరాజు, కో-ఆర్డినేటర్ కోటేశ్వరరావు, సభ్యులు సూర్యారావు, లోహితాస్, కృష్ణారావు పాల్గొన్నారు.










