May 05,2023 01:04
రక్తదాన శిబిరంలో పాల్గొన్న సొసైటీ పాలకవర్గం

ప్రజాశక్తి-బాపట్ల: కళాశాల స్థాయిలో విద్యార్థులు రక్తదానం చేయడంతో పాటు ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన కల్పించాలని బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం బాపట్ల మహిళ ఇంజనీరింగ్‌ కళాశాలలో రేపల్లె, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రక్తదానం చేయడం ప్రాణదాతలుగా నిలిచి సేవ దృక్పథం కలిగి ఉండాలన్నారు. సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానంతో ఒక ప్రాణం నిలబెట్టడానికి దోహదపడుతుందన్నారు. హరి పద్మ ప్రసాద్‌ శిబిరంలో70 మంది కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సొసైటీ సంయుక్త కార్యదర్శి హరి పద్మ ప్రసాద్‌, ఉపాధ్యక్షులు డి రామ్మోహనరావు, జి దిలీప్‌ కుమార్‌, కోశాధికారి టి. రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి శ్రీనివాసరావు, ఎన్‌సిసి అధికారి కెప్టెన్‌ శ్రీదేవి, అధ్యాపకులు, ఎన్‌సిసి క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.