Sep 29,2023 21:54

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
   సేవా పక్వాడా పక్షోత్సవాలలో భాగంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏలూరు విజన్‌ లైన్స్‌క్లబ్‌ సహకారంతో స్థానిక ఆర్‌ఆర్‌ పేటలోని గ్రావిటీ జిమ్‌ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 66 మంది యువకులు రక్తదానం చేశారని జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేయడం వలన ఆ రక్తాన్ని కాంపోనెంట్లుగా విభజించి, ముగ్గురు ప్రాణాలను కాపాడగలుగుతామని తెలిపారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా ఇతరులకు సహాయం చేయగలిగే గొప్ప ఆస్తి రక్తమేనన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి సహకరించిన ఏలూరు విజన్‌ లైన్స్‌క్లబ్‌, గ్రావిటీ జిమ్‌ సెంటర్‌ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యదర్శి బి.బెన్ని, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ కె.వర ప్రసాదరావు, ఏలూరు విజన్‌ లైన్స్‌క్లబ్‌ రీజియన్‌ ఛైర్‌ పర్సన్‌ ఏ.శేషుకుమార్‌ పాల్గొన్నారు.