Aug 15,2023 21:03

రక్తదానం చేస్తున్న ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌

 నందలూరు : రక్తదానం చేయడం ద్వారా పలువురి ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారని ఎస్‌ఐ మహమ్మద్‌అబ్దుల్‌ జహీర్‌ అన్నారు. మంగళవారం అరవపల్లిలోని ఆర్‌అండ్‌బి అతిథిగహంలో హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఇబ్బు, పల్లె గ్రీష్మంత్‌రెడ్డి, సుబ్బరాయుడు, ప్రవీణ్‌, కానిస్టేబుల్స్‌ మహేంద్ర, దర్బార్‌ లతోపాటు పలువురు రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానంలో పాల్గొన్న వారికి పంచాయితీ వైస్‌ సర్పంచ్‌ పుష్పలత, హిమగిరి నాథ్‌యాదవ్‌లు పండ్లరసాలు అందించారు.. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు పల్లె గ్రీష్మంత్‌ రెడ్డి, బహుమతులను అందించారు. విజ్‌డమ్‌ స్కూల్‌ యాజమాన్యం బ్రాస్‌ మెడల్స్‌ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, జిల్లా వక్ఫ్‌బోర్డ్‌ మైనారిటీ కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు కరీముల్లా ఖాన్‌, హెచ్‌ఆర్‌పిసిఐ డైరెక్టర్‌ కష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు మేరీ, నందలూరు ఉపసర్పంచ్‌ ఇబ్బు, హ్యూమన్‌ రైట్స్‌ ఉమ్మడ ిజిల్లా అధ్యక్షులు డేవిడ్‌,కళ్యాణ్‌ రాజ్‌, నాయకులు జుల్ఫికర్‌, గోపీనాథ్‌ యాదవ్‌. రెడ్‌ క్రాస్‌ సొసైటీ కి చెందిన తేజ, సుధాకర్‌, ప్రశాంతి పాల్గొన్నారు.