Sep 28,2023 19:04

రక్తదానం చేస్తున్న దృశ్యం

రక్తదానం చేస్తున్న దృశ్యం
రక్తదానం గొప్పది
ప్రజాశక్తి-కావలి:స్వచ్చంద రక్తదానం కుల మతాలకు అతీతమైన సేవాకార్యక్రమం అని వాయిస్‌ అఫ్‌ ముస్లిం మైనారిటీ సంస్థ అధ్యక్షులు మొగల్‌ సలీం బేగ్‌ పేర్కొన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ ( మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం ) సందర్బంగా స్థానిక తుపాన్‌ నగర్‌ లోని సుల్తానే మదీనా మస్జీద్‌ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా సలీం మాట్లాడారు. ఈ శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు. మస్జీద్‌ కమిటీ సభ్యులుషేక్‌ ముజిబ్‌, వాసిమ్‌ అక్రమ్‌, షాజహాన్‌, దస్తగిరి, కాలేషా, అబ్దుల్లా, గౌస్‌ అహ్మద్‌, షాలు, రషీద్‌, నయీమ్‌, పద్మావతి, శేషమ్మ, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.