Aug 10,2023 21:00

రక్తదానం చేయండి.. ప్రాణాన్ని కాపాడండి

జమ్మలమడుగు : రక్తదానం చేయండి.. ప్రాణాన్ని కాపాడండి అని జమ్మలమడుగు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రఫిక్‌పాషా పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడమంటే మరొకరికి జీవితాన్నివ్వడమేనని తెలిపారు. రక్తదాన నిల్వ కేంద్రం డాక్టర్‌ శ్రీలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. ఐసిటిసి కౌన్సిలర్‌ వి.ప్రతాప్‌కుమార్‌ మా ట్లాడుతూ రక్తదానం ప్రోత్సహించే వారి కోసం మార్గదర్శకాలను వివరిం చారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ నెల్సన్‌ మాట్లాడుతూ ప్రతి చోట రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. రక్తం అవసరమైన వారు జమ్మలమడుగు ప్రభు త్వాసుపత్రి రక్త నిల్వ కేంద్రంలో సంప్రదించవచ్చన్నారు. 24 గంటలు రక్తం అందుబాటులో ఉంటుందన్నారు. దాతలు బైరెడ్డి, పలువురు దాతలు తీసు కొచ్చి వారిచే రక్తం ఇప్పించారు. వారిని ప్రోత్సహించి వారిచ్చే రక్తదానం చేయించారు. కార్యక్రమంలో సిస్టరు లీలారాణి, సిబ్బంది పాల్గొన్నారు. శిబిరాన్ని ప్రారంభించిన మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఫిక్‌ పాషా