ప్రజాశక్తి - విశాఖ : స్థానిక ఉడా చిల్డ్రన్ ధియేటర్ నందు శుక్రవారం ఉదయం 8 గంటలకు రక్త దాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రక్తదానం చేశారు. ఆయనతోపాటు రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్, రెడ్ క్రాస్ సంస్థ అధికారి రావు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










