ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయాలని, రక్తదానం అన్ని దానాల్లోకి గొప్పదని వైద్యులు శ్రీనివాస్ బాబు, శారద, వీణ తెలిపారు. బుధవారం విజయ మహిళా మండలి సిఇఒ ఓంకారమాచారి, పిఒ వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. స్త్రీ, పురుషులిద్దరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు విజయ మహిళా మండలి సిబ్బంది, సిద్ధార్థ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆర్డీప్ సంస్థ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ మురళీ మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించారు. ఆర్డీప్ ప్రాజెక్ట్ మేనేజర్ మాలిక్ మాట్లాడుతూ... 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయొచ్చన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారి జోనాథన్, ఆర్డీప్ సిబ్బంది ఎం.రంగన్న, ఎర్రిస్వామి, కవితా పాల్గొన్నారు.
ఆదోనిలో అవగాహన కల్పిస్తున్న ప్రిన్సిపల్










