రక్తదానానికి యువత ముందుకు రావాలి
ఖాజీపేట : రక్తదానం చేసేందుకు యువత ముం దుకు రావాలని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మైదుకూరు రోడ్డులోని నర సింహా డయాగస్టిక్ కేం ద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా డిఎల్ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినం దనీయమన్నారు. ఆపత్కాల సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డయాగస్టిక్ నిర్వాహకుడు నరసింహ, శివకుమార్‌రెడ్డి, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ సం దర్భంగా డిఎల్‌ను నిర్వాహకులు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.
డిఎల్ రవీంద్రారెడ్డికి స్వాగతం పలుకుతున్న యువత










