రక్తదాన శిబిరం
ప్రజాశక్తి-కావలి : మొహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా బుధవారం కావలి పట్టణం వైకుంటపురం మదీనా మసీదులో రక్తదాన శిబిరం నిర్వహించారు. నెల్లూరు ముఫ్తీ అబ్దుల్ హాఫ్ సాబ్ ప్రార్థనలతో శిబిరం ప్రారంభమైంది. డివిజన్ హాజీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో వైకుంటపురం మసీదు కమిటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ తమ సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రేమ, సోదరభావం, మానవ విలువలు, మానవ జాతికి తెలియజేసి కుల మతాలకతీతంగా మనిషితో మనిషిని హృదయంతో హృదయాన్ని కలపటమే ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. ఈ శిబిరంలో 80 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బెజవాడ రవికుమార్, డాక్టర్ షేక్ హలీ మౌలాలి, డాక్టర్ షేక్ అక్బర్ షాV్‌ా, డాక్టర్ ఎ.ఉమాచంద్, డాక్టర్ కే.ఆనంద్ కుమార్, డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్, మొహమ్మద్, సాదిక్ హుస్సేన్, రెడ్‌క్రాస్ ముఖ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, ఢాకారపు రవిప్రకాష్, పట్టణ ముస్లిం ప్రముఖులు మొగల్ సలీంబేగ్, షేక్ అబ్దుల్ రషీద్, పటాన్ నవాజ్ ఖాన్, షేక్ నాయబ్ రసూల్, సర్దార్ కిర్మీణి, షేక్ దస్తగిరి, షేక్ కరిముల్లా, షేక్ బాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.










