Jan 26,2023 23:47

రక్తదానం చేసిన నారాయణరావు

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:స్థానిక తుని రోడ్‌లోని వాసవి కళ్యాణమండపంలో రక్తదాన శిబిరాన్ని రోటరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ సుతాపల్లి అప్పలరాజు ప్రారంభించారు. ముందుగా స్థానిక వ్యాపారవేత్త వెలగా నారాయణరావు రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది దాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, ఒక్క వ్యక్తి రక్త దానం చేస్తే ముగ్గురుకి ప్రాణదానం చేసినట్లేనన్నారు. సంవత్సరంలో రెండుసార్లు రక్తదాన శిబిరాలు రోటరీ నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధి ఫణి, పచ్చిగొల్ల నారాయణరావు, దేవత కామేష్‌, జేవి రాజకుమార్‌, పి.తాతాజీ, వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.