Sep 09,2022 23:40

రక్తదానం చేస్తున్న యువకులు

ప్రజాశక్తి -గాజువాక : రక్తదానంతో ఆపదలో ఉన్న అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం గాజువాక ఆటోనగర్‌ వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్‌ అనంతర పరిస్థితుల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యల ద్వారా అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, దీంతో రక్తనిల్వల కొరత ఉత్పన్నమైందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహణకు ముందుకొచ్చిన గాజువాక వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను అభినందించారు. సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతలు, నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా 250 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తి రెడ్డి, జనసేన నాయకులు కోన తాతారావు, బిజెపి నాయకులు కష్ణంరాజు, గాజువాక సిఐ పాల్గొన్నారు.