Oct 15,2023 22:36

రక్తదాన శిబిరానికి విశేష స్పందన

రక్తదాన శిబిరానికి విశేష స్పందన
ప్రజాశక్తి-వరదయ్యపాలెం: ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పా టు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వైసీపీ జేసిఎస్‌ మండల కన్వీనర్‌ చిన్న మాట్లాడుతూ బెటర్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ పూర్‌ చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రియాజ్‌ను అభినందించారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించి మధ్యతరగతి కుటుంబంలో ఎన్నో కష్టాలు పడి చదువుకుని దేశంలోనే అత్యుత్తమమైన రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కలాం జీవితమే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆయన దేశానికి చేసిన సేవలు వెలకట్టలేని వని నేటి యువత ఆయన మార్గంలో పయనించాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మండలంలోని యువకులను ఈ బహత్తర సేవలో భాగస్వాములు చేయడం ఏంతో సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పాండురు ఉపసర్పంచ్‌ మహేంద్ర, టిడిపి నాయకులు నవాబ్‌, సిఐటియూ కన్వీనర్‌ బాషా, సంస్థ సభ్యులు అబ్దుల్‌, రియాజ్‌, అబ్దుల్లా, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు మధు, దాతలు పాల్గొన్నారు.