ప్రజాశక్తి-పాడేరు:స్థానిక మోదమాంబ ప్రైవేట్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. మోదమాంబ పాఠశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు మూర్తి వర్ధంతిని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ట్రెయినీ ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీ వాస్తవ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రక్తదానం చేయడంతో ఎటువంటి వంటి సమస్య లేదని, అపోహలు విడనాడి రక్తం దానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారికీ కాపాడాలని యువతకు సూచించారు. అవగాహన కలిగి రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. దివంగత ప్రిన్సిపాల్ మూర్తి సేవలను ఆయన తెలుసుకొని ప్రత్యేకంగా కొనియాడారు. పూర్వ విద్యార్థుల సేవలను అభినందించారు. జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సేవలను విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని ఈ సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్చందంగా రెడ్ క్రాస్ సభ్యులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. రక్తం దానం చేసిన యువకులకు జామ మొక్కలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఈ పాఠశాల ప్రాంగణంలోలో మొక్కలు నాటారు. పాఠశాల సిబ్బంది ఆయనను సత్కరించారు.ఈ రక్తదాన శిబిరంలో రక్తదాతలు 83 యూనిట్లు రక్తాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, సభ్యులు జయ, లోహితస్, సూర్యారావు, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










