Oct 11,2023 23:37

బంగారు తల్లి ప్రోగ్రెస్‌ కార్డుల ఆవిష్కరణలో మంత్రి అంబటి రాంబాబు, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు

పల్నాడు జిల్లా: కిషోర బాలికలలో రక్తహీనత తగ్గుదల వల్ల ఆక్సిజన్‌ సరఫరా తగ్గి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తద్వారా చదువుపై దృష్టి సారించడం జరగదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధ వారం స్థానిక నరసరావుపేట భువనచంద్ర టౌన్‌ హాల్‌ నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బంగారు తల్లి ప్రోగ్రెస్‌ కార్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ రక్తం తక్కువగా ఉన్న వారికి పోషకాహారాలు అందించడం ద్వారా హిమోగ్లోబిన్‌ పెరుగుతుదేని తద్వారా చురుకుదనం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు. హిమోగ్లోబిన్‌ ప్రోగ్రెస్‌ కార్డు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని తద్వారా పిల్లలకు ఐరన్‌ సమృద్ధిగా ఉండే, బెల్లంతో చేసిన పదార్థాలు, ఆకుకూరలు, పాలు, గ్రుడ్డు వంటివి అందించాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు శ్రీకృష్ణదేవ రాయులు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభు త్వం అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందిస్తున్న నగదును సద్వినియోగం చేసు కొని కిషోర బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలన్నారు. బంగారు తల్లి కార్యక్రమం అమలులో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అభిజిత్‌ బెనర్జీ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివ రించారు.
కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి మాట్లాడుతూ బంగారు తల్లి ముఖ్య ఉద్దేశం రక్తహీనత ఉన్న పిల్లలలో కనీసం హిమోగ్లోబిన్‌ను 9 శాతానికి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా అందిస్తున్న రాగి జావా, గుడ్డు చెక్కిలను చిక్కిలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తద్వారా పౌష్టి కాహారం పెరుగుతుందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లా డుతూ బంగారు తల్లి హిమోగ్లోబిన్‌ ప్రోగ్రెస్‌ కార్డు స్కూల్‌ లో ఇస్తున్న ప్రోగ్రెస్‌ కార్డు లాగా ఉందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రి , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రవి, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్గొన్నారు.