Feb 16,2023 23:55

శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం కలక్టరేట్‌ సమావేశ మందిరంలో రెడ్‌ క్రాస్‌ ఏర్పాటు చేసిన రక్త దాన శిభిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రక్త దానం చేయడంతో ఎటువంటి నష్టమూ లేదని, ఆరోగ్య వంతులందరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. జిల్లాలో అవసరమైనంత రక్త నిల్వలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల వద్ద ప్రత్యేక శిభిరాలు ఏర్పాటు చేసి రక్త సేకరణ చేయాలన్నారు. రక్త దాన శిభిరంలో పది యూనిట్ల రక్తం సేకరించినట్లు రెడ్‌ క్రాస్‌ కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసి శివ శ్రీనివాసు, డిఆర్‌ఓ పి.అంబేద్కర్‌, రెడ్‌ క్రాస్‌ కోఆర్డినేటర్‌ కోటేశ్వరరావు, సభ్యులు, పేథాలజిస్ట్‌ రూప కళ పాల్గొన్నారు.