Nov 04,2023 00:58

ప్రజాశక్తి - భట్టిప్రోలు
భట్టిప్రోలు పంచాయితీ అద్దేపల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణభేరి యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కర్నూలు నుండి ప్రారంభమైన సిపిఎం ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర ఈనెల 8న సాయంత్రం భట్టిప్రోలు చేరుకుంటుందని తెలిపారు. స్థానిక రథం సెంటర్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం భట్టిప్రోలు మండల కమిటీ ఆధ్వర్యంలో అద్దేపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన పాదయాత్రతో భట్టిప్రోలు వీధుల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, పి అహరోను, బట్టు నాగమల్లేశ్వరరావు, దీపాల సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్ పాల్గొన్నారు.