Nov 11,2023 23:09

ప్రజాశక్తి-రామచంద్రపురం ద్రాక్షారామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భీమేశ్వర స్వామి దేవస్థానంలో దివీస్‌ లాబొరేటరీస్‌ ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 4 మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. 6 కూలర్స్‌ 8 ఎస్‌ఎస్‌ స్టీల్‌ సింకులు కలిపి సుమారు రూ.72 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశామని, వాటిలో రెండు వాటర్‌ ప్లాంట్‌ లు నిర్మాణం పూర్తయినట్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఒ తారకేశ్వరరావు, దివీస్‌ లేబరేటరీస్‌ ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.