Oct 08,2023 16:57

సమావేశంలో మాట్లాడుతున్న సి గుణశేఖర్

రజకుల సమస్యల పరిష్కారంకు  పోరాటాలకు సిద్ధం కావాలి  

ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం
ప్రజాశక్తి - ఆత్మకురు

      ఆత్మకూరు పట్టణంలో ధనుంజయ మీటింగ్ హాల్లో  ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆత్మకూర్ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నంద్యాల జిల్లా కన్వీనర్ సి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం నాడు జరిగింది .ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సి గురుశేఖర్ మరియు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాజశేఖర్ మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రజకులకు చేసిందేమీ లేదని   రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ డైరెక్టర్లు బోర్డు నియమించిన కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని అలాగే ఈ ప్రభుత్వం రజకుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్థం అవ్వాలంటే రజక కార్పొరేషన్ చేసినటువంటి తీర్మానాలు వ్రుత్తి చెరువుల పైన రజకులకే పూర్తి హక్కు ఉండాలని, దేవాలయాలు ప్రభుత్వ హాస్పిటల్స్ ఇతర డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ధోబి పోస్ట్లు భర్తీ చేయాలని, 50 సంవత్సరాలు పూర్తయిన రజకులకు పెన్షన్లు ఇవ్వాలని,4 రజకుల భద్రత కొరకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, రజక కార్పొరేషన్ బోర్డు తీర్మానాన్ని కూడా ఈ ప్రభుత్వం గౌరవించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ప్రతి పట్టణ మండల కేంద్రాల్లో మోడ్రన్ దోబీ ఘాట్ లు ఏర్పాటు చేయాలని అర్హులైన రజకులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టిల్లు కట్టి ఇవ్వాలని   తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఇచ్చిన విధంగా ప్రతి ఇస్త్రీదారుడికి 250 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని అలాగే అపార్ట్మెంట్ వాచ్మెన్ కమ్ ఇస్త్రీదారులకు  కనీస వేతన చట్టం అమలు జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని, వృత్తి చెరువుల పైన రజకులకే పూర్తి హక్కు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్టోబర్ లో జిల్లాలో మండలలో రజకులు సమస్యల పైన అధ్యయన బృందాలుగా ఏర్పడి రజకుల సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు,        *ఈ సమావేశంలో సిఐటియు నాయకులు రణధీర్. ఏపీ రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా కమిటీ పాములపాడు రామకృష్ణ. ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ. కార్యదర్శి శ్రీరాములు. గౌరవాధ్యక్షులు పెద్దసుబ్బయ్య. బంగారం  పట్టణ కమిటీ సభ్యులు శివ కేశవ్ శోభన్ బాబు. బసవయ్య. చిన్న దర్గయ్య. వెంకటరమణ. శివ కేశవ్. రవిశంకర్. రాజు.హరినాథ్. సాయిబాబు. వెంకటేశ్వర్లు. పుల్లయ్య.తదితరులు పాల్గొన్నారు