ప్రజాశక్తి -కంచరపాలెం : రజక వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు బి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం. కంచరపాలెం సిఐటియు కార్యాలయం వద్ద రజక వృత్తిదారుల సంఘ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ,. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రజక వృత్తిదారులు కులవృత్తిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సాంప్రదాయ రజక వృత్తిలో ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టి వీరి ఉపాధిని దెబ్బతీస్తున్నారన్నారు. రజక వృత్తిలో లాండ్రీలు, డ్రైక్లీనింగ్ షాపులు, సంచార లాండ్రీలకు పెట్టుబడి లేక రజకులు వృత్తి కోల్పోతున్నారన్నారు. రజకుల ఉపాధికి వీరి సొసైటీ ద్వారా సబ్సిడీపై బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఈశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో బిసి కార్పొరేషన్లు, సహాయక సంఘాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిసిలకు కార్పొరేషన్ పెట్టినా, వాటికి నిధులు లేకుండా నామమాత్రం చేశారని విమర్శించారు. రజక సంక్షేమం పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఆదుకునే చర్యలు చేపట్టాాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు రజకులంతా ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టి రాము, బి రాము, కె ధనుంజరు, ఒ.దుర్గారావు, ఎన్ దేవి, ఎం చిన్నారావు, కె.సింహాద్రి, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు










