Apr 16,2023 16:25

మాట్లాడుతున్న నందవరం శ్రీనివాసులు

రజక వాలంటీర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- తక్షణమే రజకుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని  ప్రధాన డిమాండ్

- ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి నాయకులు నందవరం శ్రీనివాసులు, దూపాటి చిన్న డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల రూరల్

       రజక మహిళ పై లైంగిక వేధింపులకు పాలపడిన బోడి పెద్ధి రాజు, చల్లిబోయిన పాపా రావు, అంగేళ్ల శ్రీనివాసులు అనే ముగ్గురు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, రిమాండ్ పంపాలని ఏపీ రజక  ఎస్సీ సాధన చైతన్య సమితి నాయకులు నందవరం శ్రీనివాసులు డిమాండ్ చేశారు.  నంద్యాల పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వాలంటీర్ బైనపాలెపు దుర్గ అనే రజక మహిళ పై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, రిమాండుకు పంపాలని ఏపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి నాయకులు నందవరం శ్రీనివాసులు, దూపాటి చిన్న డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక రజక ఎస్సీ సాధన సమితి కార్యాలయంలో  జిల్లా నాయకుడు దూపాటి చిన్న ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యకుడు నందవరం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రలో రజక మహిళల పైదాడులు,రజక కుటుంబాలను బహిష్కరణలు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు, కార్యకర్తల పై చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చోద్యం చోస్తున్నారని విమర్శించారు.పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం, గొరగనమూడి గ్రామంలో సచివాలయం వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న బైనపాలెపు దుర్గా అనే రజక మహిళ పై,అధికార పార్టీ నాయకులు కాపు (బలిజ)సామాజిక వర్గానికి చెందిన బొడిపెద్ది రాజు, చల్లిబోయిన పాపారావు, అంగేళ్ల శ్రీనివాసులు అనే ముగ్గురు,  మానసికంగా శారీరకంగా వేధింపులకు పాల్పడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.రజక మహిళపై వేధింపులకు పాల్పడిన నిందితులను,పోలీసు అధికారులు  చట్టపరంగా కేసులు నమోదు చేసి రిమాండుకు పంపించాలని డిమాండ్ చేశారు. గతంలో నంద్యాల జిల్లా గడివేముల మండలం కరిమద్దెల గ్రామంలో కూలీ పెంచాలని అడిగినందుకు  గ్రామపెద్దలు 50పై ఉన్న రజక కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని, అదేవిధంగా కోవెలకుంట్ల మండలం నట్ల కొత్తూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలుగా పనిచేశారని వైసీపీ సర్పంచి అనుచరులు  రజకులపై దాడి చేసి తీవ్రంగా గాయపడితే, రజకులపైనే హత్యాయత్నం  కేసులు పెట్టి రిమాండుకు పంపిన సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ది చేయకపోయినప్పటికీ,  దళితులు, రజకుల పై దాడులకు పాల్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళితుల అట్రాసిటీ యాక్టు మాదిరిగా  రజక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు, రామకృష్ణ, ఆంజనేయులు, రత్నమయ్య, తదితరులు పాల్గొన్నారు.